వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన సాయి ట్రస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Sathya Sai Baba
హైదరాబాద్: సత్య సాయిబాబాబా ఆధ్యాత్మిక కేంద్రాన్ని నిర్వహించి శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టు సోమవారం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. పది రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఇచ్చిన నోటీసుకు స్పందిస్తూ ఆ నివేదికను సమర్పించింది. తన పనితీరును, ఆర్థిక వివరాలను పొందుపరుస్తూ ఈ నివేదికను ట్రస్టు దేవాదాయ శాఖ కార్యదర్శి కెవి రమణాచారికి సమర్పించింది. రమణాచారి ఈ నివేదికను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సమర్పిస్తారు.

ట్రస్టు ఆర్థిక వ్యవహారాలను, కార్యకలాపాలను, రెవెన్యూను, తాను నడిపే సంస్థల వివరాలను, రోజువారీ పనితీరును నివేదికలో పొందు పరిచారు. బ్యాంక్ ఖాతాల వివరాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కల్పించిన రాయితీల వివరాలను, మినహాయింపులను కూడా నివేదికలో వివరించారు. ఈ నివేదికను ప్రభుత్వం పరిశీలించిన తర్వాత ట్రస్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనే భక్తుల డిమాండును పరిగణనలోకి తీసుకుంటుంది. ట్రస్టు వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఏదైనా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే విషయంపై కూడా ఆలోచన చేస్తుంది.

గత నాలుగు దశాబ్దాల కాలంలో ట్రస్టు వ్యవహారాల్లో మొదటి సారి ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ట్రస్టు సభ్యులపై అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు రావడంతో ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. అనంతపురం పోలీసులు 35 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు. ట్రస్టు సభ్యులు రత్నాకర్, శ్రీనివాసన్‌లను విచారించారు.

English summary
The Sri Sathya Sai Central Trust, which manages the affairs of late Sathya Sai Baba's spiritual empire on Monday, submitted a detailed report to the Andhra Pradesh government on its functioning as well as 
 financial details.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X