వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గనుల అక్రమాలలో యెడ్డీ కొడుకు, అల్లుడు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

BS Yeddyurappa
బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప, జెడిఎస్ నేత కుమారస్వామి, మంత్రులు గాలి జనార్దన్ రోడ్డి, కరుణాకర్ రెడ్డితో పాటు బిజెపి, కాంగ్రెసు, జెడిఎస్ పార్టీలకు చెందిన పలువురు నేతలు అక్రమాలలో ఎవరూ తక్కువ కాదన్న లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డే గురువారం మరో బాంబు పేల్చారు. గత కొన్ని రోజులుగా తన ఫోన్ ట్యాపింగుకు గురవుతుందని ఆరోపించారు. గనుల అక్రమాల కారణంగా నివేదికలోని కీలకాంశాలు బహిర్గతమైనట్లు ఆయన చెప్పారు. అయితే అవి బహిర్గతం అయినందుకు ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే నివేదిక బహిర్గతమైనంత మాత్రాన నష్టమేమీ లేదన్నారు.

నివేదికను శుక్రవారం ప్రభుత్వానికి ఇస్తానని చెప్పారు. లోకాయుక్త నివేదికలో ముఖ్యమంత్రి యడ్యూరప్ర సహా ఆయన కుమారుడు, అల్లుడి పేర్లు ఉన్నాయని చెప్పారు. గనుల అక్రమాల కారణంగా 18వేల కోట్ల నష్టం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. యడ్యూరప్ప ఆయన కుమారుడు సుమారు 20 కోట్లు తీసుకున్నట్లు ఓ విచారణలో తేలిందన్నారు. కాగా లోకాయుక్త హెగ్డే నివేదికపై కుమార స్వామి స్పందిస్తూ గనుల అక్రమాలలో తాను ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

English summary
Karnataka CM Yeddyurappa son name is revealed in mines allegations. Lokayukra justice Santosh Hegde said that his phone is tapped since six months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X