కర్నూలు/నెల్లూరు: వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రాథమిక ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి మరోసారి శుక్రవారం ధ్వజమెత్తారు. ప్రభుత్వ పథకాలపై తప్పుడు కథనాలు ప్రచురిస్తున్న సాక్షిపై పరువు నష్టం దావా వేస్తామని కర్నూలులో విలేకరులతో మాట్లాడుతూ హెచ్చరించారు. దేశంలోనే అత్యంత అవినీతిపరుడు జగన్ అని ఆరోపించారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డాడని ఆరోపించారు. దేశంలో అత్యంత సంపన్నుడు కూడా జగన్ అన్నారు. కాంగ్రెసు పార్టీని విమర్శించే హక్కు ఎవరికీ లేదన్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం పేరుతో తెలంగాణ నేతలు ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి నెల్లూరులో అన్నారు. ఢిల్లీలోని ఎపి భవనంలో తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు హరీశ్వర్ రావు దళితుడిపై దాడి చేయడమే అందుకు మంచి నిదర్శనం అన్నారు. అలాంటి వారిని ప్రజలు ఎప్పుడూ క్షమించరని అన్నారు.
Minister DL Ravindra Reddy said that he will defamation case against YSR Congress president YS Jaganmohan Reddy's Sakshi paper for making allegations against government scheme.
Story first published: Friday, July 22, 2011, 15:35 [IST]