వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుమారుల అత్యాశే యడ్యూరప్ప కొంప ముంచింది

By Pratap
|
Google Oneindia TeluguNews

BS Yeddyurappa
బెంగుళూరు: కుమారుల అత్యాశే దక్షిణ భారతంలో తొలి బిజెపి ముఖ్యమంత్రి యడ్యూరప్ప కొంప ముంచింది. దాంతో ముఖ్యమంత్రిగా 38 నెలల ఆయన పాలన అంతమైంది. లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డే తప్పు పట్టిన నేపథ్యంలో ఆయన ఆదివారం తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప పదవీ బాధ్యతలు చేపట్టిన ఐదు నెలల తర్వాత ఆయన కుమారులు బివై రాఘవేంద్ర, బివై విజయేంద్ర చేసుకున్న భూ ఒప్పందాలు చేసుకున్నారు. ఇదే యడ్యూరప్ప 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఓ మచ్చగా మిగిలింది.

లోకాయుక్త నివేదిక ప్రకారం - బెంగుళూర్‌లోని అత్యంత విలువైన 1.20 ఎకరాల భూమిని డీనోటిఫై చేయాలని ఇద్దరు కుమారులు యడ్యూరప్పపై ఒత్తిడి తెచ్చారు. అసలు యజమానులకు అప్పగించడానికి ప్రభుత్వం 2004లో 17 లక్షలకు ఆ భూమిని స్వాధీనం చేసుకుంది. ఆ భూమిని యడ్యూరప్ప కుమారులు 20 లక్షల రూపాయలకే తీసుకున్నారు. దాని మార్కెట్ విలువ 1.34 కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ భూ లావాదేవీయే యడ్యూరప్ప గద్దె దిగడంలో ప్రధాన పాత్ర పోషించింది. మరి కొన్ని డీనోటిఫికేషన్ వ్యవహారాల్లో కూడా యడ్యూరప్ప కుమారుల పేర్లు వినిపిస్తున్నాయి. వాటికి సంబంధిచిన కేసులు అవినీతి నిరోధక కోర్టుల ముందు పెండింగులో ఉన్నాయి. మరో ప్రధాన ఆరోపణ - యడ్యూరప్ప సొంత పట్టణం షిమోగాలోని ప్రేరణ ఎడ్యుకేషన్ ట్రస్టు 2010లో సౌత్ వెస్ట్ మైనింగ్ కంపెనీ నుంచి 20 కోట్ల రూపాయల లంచం తీసుకుంది.

English summary
Ambitious sons brought BS Yeddyurappa to grief, his 38-month tenure ending on Sunday in ignominy, after their dubious land deals were exposed by Lokayukta Justice Santosh N Hegde.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X