హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేవలం ఆర్థికమే, సిబిఐ విచారణ అవసరం లేదు: ఎమ్మార్

By Srinivas
|
Google Oneindia TeluguNews

High Court
హైదరాబాద్: ఎపిఐఐసికి తెలియకుండా ఎమ్మార్ భూకేటాయింపులు అక్రమంగా కేటాయించిందని తద్వారా ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం జరిగిందని ప్రభుత్వం తరఫు న్యాయవాది సోమవారం హైకోర్టులో వాదించారు. సోమవారం ఉదయం సిబిఐ ఐజి లక్ష్మీ నారాయణ ఎమ్మార్ ప్రాపర్టీస్, జగతి పబ్లికేషన్స్ పెట్టుబడులకు సంబంధించిన దర్యాఫ్తును హైకోర్టుకు సమర్పించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కాసేపటికి కోర్టు సహాయకుడు నివేదిక సమర్పించిన అనంతరం విచారణ ప్రారంభమయింది. మొదట ఎపిఐఐసి తరఫు న్యాయవాదులు తమ వాదన వినిపించారు.

ఎకరా భూమి రూపాయలు 22 కోట్లు ఉన్న సమయంలో రూ.5 వేలకే ఎమ్మార్ సంస్థ ఇతరులకు కేటాయించారని ఆరోపించారు. ఎలాంటి విల్లాలు కట్టకుండానే స్టైరిస్ కంపెనీకి మార్కెటింగ్ చేశారని అన్నారు. ఎపిఐఐసికి తెలియకుండా ఎమ్మార్ సంస్థ యాక్సిస్ బ్యాంకులో 150 కోట్ల రుణం తీసుకున్నదన్నారు. ఎమ్మార్, ఎపిఐఐసి మధ్య ఉన్న వివాదం కేవలం ఆర్థిక పరమైనది మాత్రమేనని అందుకు సిబిఐ విచారణ అవసరం లేదని ఎమ్మార్ తరఫు న్యాయవాది వాదించారు. కాగా ఇరువురి వాదనల అనంతరం న్యాయమూర్తి కేసును మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేశారు.

English summary
EMAAR lawyer argued today in high court that there is no need of cbi enquiry on APIIC land. He said It is small property issue between EMAAR and APIIC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X