ప్రియురాలి ఇంటిముందు ప్రియుడి ఆత్మహత్య యత్నం

జగదీష్, సదరు యువతి గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారని, పెళ్లి చేసుకోమంటే ఆమె నిరాకరించడంతో నిరాశతో అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని యువకుడి తరఫు బంధువులు చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే యువతి తరఫు బంధువులు దానిని కొట్టి పారేస్తున్నారు. జగదీష్‌ది వన్ సైడ్ లవ్ అని, గత కొన్నాళ్లుగా ప్రేమించమని తమ కుమార్తె వెంబడి పడుతున్నాడని ఆమె అంగీకరించడం లేదని చెబుతున్నారు. తమ కూతురు జగదీష్‌ను ప్రేమించలేదని చెప్పారని సమాచారం. కాగా పోలీసులు ఇరువురి వాదనలు పరిగణలోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications