యడ్డీకి మరో దెబ్బ, క్రిమినల్ చర్యలకు భరద్వాజ్ ఆదేశం

BS Yeddyurappa-HR Bhardwaj
బెంగళూరు: కర్ణాటక ఆపద్దర్మ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు మరో ఎదురు దెబ్బ తగిలింది. అదను చూసి యడ్యూరప్పపై గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ్ వాత పెట్టారు. అక్రమ మైనింగ్‌పై లోకాయుక్త నివేదికను ఆయన ఆమోదించారు. యడ్యూరప్పపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను ఆదేశించారు. మైనింగ్ కుంభకోణంలో చిక్కుకున్న యడ్యూరప్ప ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లైంది.

తనను ప్రాసిక్యూట్ చేయాలని లోకాయుక్త ఇచ్చిన సిఫార్సును కొట్టేయాలని కోరుతూ యడ్యూరప్ప మంగళవారం హైకోర్టుకు వెళ్లారు. ఆ నిర్ణయాన్ని సమీక్షించాలని కోరుతూ ఆయన కొత్త లోకాయుక్తకు ఓ పిటిషన్ పెట్టుకున్నారు. యడ్యూరప్పకు తన వాదనను వినిపించడానికి అవకాశం కల్పించకపోవడం సహజ న్యాయానికి విరుద్ధమని యడ్యూరప్ప రాజకీయ కార్యదర్శి బిజె పుట్టస్వామి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+