హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణవాదుల ఒత్తిడి: ప్రధానికి ముఖ్యమంత్రి ఫోన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: 14ఎఫ్ రద్దు చేయకుండా పరీక్షలు నిర్వహిస్తే ఊరుకునేది లేదని తెలంగాణవాదులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది. 14ఎఫ్ రద్దుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారని సమాచారం. మరి కొన్ని రోజుల్లో ఎస్సై పరీక్షలు ఉన్న నేపథ్యంలో రద్దుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి పిఎంకు సూచించారు. గతంలోనే తాను కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశానని ఆయన పిఎంతో చెప్పినట్టుగా తెలుస్తోంది.

14ఎఫ్ రద్దుపై గతంలోనే అసెంబ్లీ తీర్మానం జరిగిందని ప్రధాని దృష్టికి కిరణ్ తీసుకెళ్లారు. అందుకు ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం సానుకూలంగా స్పందించారని సమాచారం. మంగళవారం సాయంత్రం కేబినెట్ రాజకీయ ఎఫైర్స్ కమిటీ సమావేశం అవుతుందని అందులో 14ఎఫ్ రద్దుపై నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. కాగా ఇటీవల హోంమంత్రి చిదంబరానికి సైతం 14ఎఫ్ పై కిరణ్ లేఖ రాశారు.

English summary
CM Kiran Kumar Reddy called Prime Minister Manmohan Singh for cancel 14F. Manmohan promised him to talk on 14f today in cabinet political affairs committee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X