హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైకోర్టు ముందుకొస్తే మేం తగ్గుతాం: కోదండరామ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్: ప్రభుత్వాలచే సక్రమంగా పని చేయించే బాధ్యతను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు తీసుకుంటే తాము సమ్మెలు, బందులు విరమించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ బుధవారం అన్నారు. హైకోర్టు ఇచ్చిన నోటీసులపై ఆయన స్పందించారు. సమ్మెలు, ఆందోళనలు ప్రజాస్వామ్య హక్కు అన్నారు. ప్రజల ఆంక్షల ప్రకారం ప్రభుత్వాలు నడవనందువల్లే తాము న్యాయం కోసం ఆందోళనలకు దిగవలసిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. 14ఎఫ్ రద్దు చేయడానికి కేంద్రం సుముఖత వ్యక్తం చేసినా ఎస్సై పరీక్షలు రద్దు చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.

విద్యార్థులు పరీక్షలకు సమాయత్తం కావడానికి సమయం కావాలన్నారు. 14ఎఫ్ రద్దు తెలంగాణ ఉద్యమ ఫలితమే అన్నారు. సకల జనుల సమ్మె వద్దనే వారు తెలంగాణ వ్యతిరేకులే అని ఆయన అన్నారు. అనివార్య పరిస్థితుల వల్లనే బందు అని చెప్పారు. ప్రజలు బందులో స్వచ్చంధంగా పాల్గొంటున్నారని అన్నారు. కాగా తెలుగుదేశం పార్టీ నేత కొత్తకోట దయాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాలు స్పందించాయి. తాము చిత్తశుద్ధితో తెలంగాణ కోసం పోరాటం చేస్తుంటే పదవుల కోసం అనడం సరికాదన్నారు.

English summary
Telangana Political JAC chairman Kodandaram said today that they will ready to withdraw strikes and bandh if High Court respond on government failures.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X