వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యాంటీ ఎఎఫ్ఎస్పీఏ ప్రచారానికి హజారేను ఆహ్వానించిన షర్మిళ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Irom Sharmila
ఇంపాల్: మణిపూర్‌లో ఎఎఫ్ఎస్పీఏ దురాఘతాలకు వ్యతిరేకంగా తాము చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా సంఘ సంస్కర్త అన్నాహజారే ఓసారి రాష్ట్రానికి వచ్చి వెళ్లాలని గత పదేళ్లుగా ఉద్యమిస్తున్న షర్మిళ బుధవారం కోరారు. రాష్ట్రంలో ఆర్ముడ్ ఫోర్సెస్ యాక్ట్(స్పెషల్ పవర్)కు వ్యతిరేకంగా గత పదేళ్లుగా షర్మిళ నిరాహార దీక్ష చేస్తోంది. షర్మిళను బుధవారం ఇంపాల్లోని ఓ కోర్టులో ప్రవేశ పెట్టారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ అన్నాహజారే వచ్చి మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. అవినీతికి వ్యతిరేకంగా అన్నా ఉద్యమం చేపట్టారన్నారు. అన్నాను మణిపూర్ ప్రజలు అభినందిస్తున్నారన్నారు. తన దీక్ష ఫలిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా మణిపూర్‌లో ప్రత్యేక సాయుధ దళాలు మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ ఆమె పదేళ్లుగా ఉద్యమిస్తోంది. రోజుకు రెండుసార్లు ఆమెకు ముక్కు ద్వారా న్యూట్రిషన్స్ అందిస్తున్నారు. పదేళ్లుగా నిరాహార దీక్ష చేస్తుండటంతో ఆమె శరీరభాగాలు బాగా దెబ్బతిన్నాయి. అయితే పదేళ్లుగా దీక్ష చేస్తున్నప్పటికీ ఆమె దీక్షకు అంతగా ప్రాధాన్యత లేక పోవడం శోచనీయం. కాగా షర్మిళకు మద్దతుగా పలువురు మహిళలు నగ్నంగా మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది.

English summary
The people of Manipur would welcome Anna Hazare with open arms if he can come here and join the campaign against Armed Forces (Special Powers) Act, stated Irom Chanu Sharmila who has been fasting against the draconian Act for the last 10 years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X