గడాఫీ తనయుడు హతం, తలదాచుకున్న భార్య

Muammar Gaddafi
ట్రిపోలీ: లిబియా నేత ముమ్మార్ గడాఫీ కుమారుడు ఖమీస్ గడాఫీని హతమార్చామని లిబియా తిరుగుబాటుదారులు ప్రకటించారు. దక్షిణ ట్రిపోలికి 80 కిలోమీటర్ల దూరంలోని ఒక నగరంలో ఖమీస్‌ను చంపేశామని తిరుగుబాటు నేనల నాయకుడు ఒకరు తనకు తెలిపారని మానవ హక్కుల మంత్రి మహమ్మద్ అల్ అలగె తెలిపారు. ఖమీస్ అంత్యక్రియలు పూర్తి చేసేసినట్లు వెల్లడించారని ఆయన పేర్కొన్నారు. ఇదే విషయాన్ని తిరుగుబాటు సేనల అధికార ప్రతినిధి మహ్మద్ షమామ్ కూడా నిర్ధారించారు.

ఖమీస్ మృతి చెందినట్లు తన దృష్టికి వచ్చిందని, అతడి మృతికి సంబంధించి కొన్ని చిత్రాలను చూసిన తర్వాత తాను అతడు చనిపోయినట్లు విశ్వసిస్తున్నానని షమామ్ తెలిపారు. మరోవైపు గడాఫీ భార్య సఫియా, కుమార్తె ఇషా, కుమారులు హన్నీబల్, మహమ్మద్‌లు అల్జీరియాలో తలదాచుకున్నారు. ఈ విషయాన్ని అల్జీరియా ప్రభుత్వం ద్రువీకరించింది. మానవీయ కోణంలో వారికి ఆశ్రయం కల్పించామని ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+