మాజీ ఎమ్మెల్యే, పారిశ్రామిక వేత్త ముళ్లపూడి మృతి

Mullapudi Harischandra Prasad
హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామిక వేత్త ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ శనివారం హైదరాబాదులోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గత కొన్నాళ్లుగా ముళ్లపూడి కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. ఈయన వయస్సు 90. ముళ్లపూడి పారిశ్రామిక వేత్త మాత్రమే కాకుండా రాజకీయాల్లోనూ రాణించారు. ఈయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు. ముళ్లపూడి 1947లో ఆంధ్ర షుగర్స్ స్థాపించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పలు పరిశ్రమలు స్థాపించారు. చిన్న వయస్సులోనే పారిశ్రామిక వేత్తగా ఎదిగారు.

ముళ్లపూడి సర్పంచ్, మున్సిపల్ చైర్మన్, శాసనసభ్యుడిగా కూడా పని చేశారు. 1955 నుండి 1967 వరకు తణుకు శాసనసభ్యుడిగా పని చేశారు. 1995లో టాప్ ట్యాక్స్ పేయర్ అవార్డును పొందారు. ఈయన ఎస్సెల్సీ వరకు తణుకులోనే చదివారు. ముళ్లపూడి మృతికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రి వట్టి వసంత్ కుమార్, రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరులు సంతాపం తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+