సిబిఐ జెడి లక్ష్మీ నారాయణకు వైయస్ వివేకా సారీ

మా కుటుంబంపై నిందలు వేసిన సమయంలో ఆవేశంలో నేను మరొకరిపై నిందలు వేయాల్సిన అవసరం లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి, తన సోదరుడు వైయస్ రాజశేఖర రెడ్డిని సిబిఐ ఎఫ్ఐఆర్‌లో ముద్దాయిని చేయడంపై తాను తీవ్ర మనస్థాపం చెందినట్లు చెప్పారు. దీనిపై కాంగ్రెసు పెద్దలతో పోరాటం చేస్తానని చెప్పారు. కాగా శుక్రవారం ఇడుపులపాయ వద్ద మీడియా ప్రతినిధులతో మాట్లాడిన వివేకా టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ బంధువు అని, ఆయన పెద్ద లంచగొండి అని ఆరోపించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications