జగన్ మాటలకు గాలి కంటతడి పెట్టారట: బైరెడ్డి

YS Jagan-Gali Janardhan Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మాటలకు కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి జైలులో కంట తడిపెట్టారని తెలుస్తోందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి బైరెడ్డి రాజశేఖర రెడ్డి వ్యాఖ్యానించారు. గాలి జనార్దన్ రెడ్డి ఎవరో తనకు తెలియదని జగన్ మాటలకు గాలి జనార్దన్ రెడ్డి జైలులో కంటతడి పట్టినట్లు చెప్పుకుంటున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. గాలి జనార్దన్ రెడ్డి, వైయస్ జగన్ అవినీతిలో అవిభక్త కవలలు అని ఆయన వ్యాఖ్యానించారు.

గాలి జనార్దన్ రెడ్డి డైరెక్టర్ అయితే, వైయస్ జగన్ యాక్టర్ అని బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెసు అధిష్టానం పెద్దలకు ముడుపులు అందాయని ఆయన ఆరోపించారు. భవిష్యత్తులో వైయస్ జగన్, కాంగ్రెసు కలిసిపోయినా ఆశ్చర్యం లేదని ఆయన అన్నారు. గాలి జనార్దన్ రెడ్డి ఇంట్లో సిబిఐ అధికారులకు దొరికింది కేవలం పాకెట్ మనీ మాత్రమేనని ఆయన అన్నారు. న్యాయవాదిని గాలి జనార్దన్ రెడ్డి విమానంలో రప్పించారంటే దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+