అజ్ఞాతంలోకి వెళ్లిన గాలి జనార్దన్ రెడ్డి అక్కాబావలు

గాలి జనార్దన్ రెడ్డి అక్కాబావలు చిత్తూరు జిల్లా కాళహిస్తిలోని ఎస్పీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలోని ఇంట్లో ఉంటున్నారు. బావ సుధాకర్ రెడ్డి కెవిబి పురం మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అక్కపై గాలి జనార్దన్ రెడ్డికి అమితమైన మక్కువ. దీంతో ఆమెకు గాలి జనార్దన్ రెడ్డి అత్యధునాతమైన ఇళ్లు నిర్మించి ఇచ్చినట్లు చెబుతారు.
గాలి జనార్దన్ రెడ్డి ఇక్కడికి వస్తుండేవారు. హెలికాప్టర్‌లో ఎస్వీ డిగ్రీ కళాశాలలో దిగి అక్కడి నుంచి కారులో అక్క ఇంటికి వస్తుండేవారు. జ్ఞానప్రసూనాంబిక అమ్మవారికి గాలి సోదరులు సమర్పించిన స్వర్ణాభరణాలు, వజ్రకిరీటం విలువను నిర్ధారించేందుకు దేవస్థానం సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications