జగనే కాంగ్రెసులోకి రావచ్చు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

తాము వేరు వేరు మార్గాల్లో ప్రజాసేవ చేస్తున్నామని, రాజకీయాలు వేరు - స్నేహం వేరని, వైయస్ జగన్ తమకు స్నేహితుడు కాబట్టి మాట్లాడడంలో తప్పు లేదని ఆయన అన్నారు. రాజకీయాల్లో ఏమైనా సాధ్యమేనని, అయితే ప్రస్తుతానికి తాము కాంగ్రెసులో ఉండి తెలంగాణ సాధించుకుంటామని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే ఉద్దేశం ఈ రోజుకైతే లేదని ఆయన అన్నారు.
కాగా, కాంగ్రెసు తెలంగాణ స్టీరింగ్ కమిటీ శనివారం రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు నివాసంలో జరిగింది. తెలంగాణ ఉద్యమం విషయంలో దూకుడు వద్దని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు మంత్రులను రాయబారులుగా పంపినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications