వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్సార్ విగ్రహంపై తెలంగాణవాదుల దాడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

YSR Statue
వరంగల్/హైదరాబాద్/ నల్లగొండ: సకల జనుల సమ్మెలో భాగంగా వరంగల్ జిల్లాలో లాయర్లు చేపట్టిన ఆందోళన కొంత ఉద్రిక్తతకు దారి తీసింది. హన్మకొండలోని సుబేదారిలో లాయర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. మార్గమధ్యంలో ఉన్న దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని వారు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. వైయస్ 2009 ఎన్నికలకు ముందు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడటమే కాకుండా ఆయన తనయుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ అభిప్రాయం ప్రకటించలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన లాయర్లు వైయస్ విగ్రహంపై దాడి చేసే ప్రయత్నాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇరువర్గాల తోపులాట జరగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

కాగా సకల జనుల సమ్మెతో కేంద్ర ప్రభుత్వం దిగి రాక తప్పదని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరాం హైదరాబాదులో అన్నారు. తెలంగాణ ఏర్పడే వరకు ఉద్యమం కొనసాగుతుందని చెప్పారు. విద్యార్థులకు తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురైనప్పటికీ ముందు ముందు వాటిని పూడుస్తామని చెప్పారు. విధిలేకనే సమ్మెకు పిలుపునిచ్చినట్లు చెప్పారు. తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మాలని కోరారు. శాంతియుతంగా పోరాటం చేద్దామని కోరారు. నల్లగొండ జిల్లా కోదాడలోని తెలుగుదేశం పార్టీ నాయకుడు చందర్ రావు ఇంటిని తెలంగాణవాదులు ముట్టడించారు. రాజీనామా చేయాలని తెలంగాణవాదులు డిమాండ్ చేశారు.

English summary
Telanganites attacked on late YS Rajasekhar Reddy statue at Hanmakonda of Warangal district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X