ముఖ్యమంత్రిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్

తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు రోజుకో డ్రామా ఆడడం మానుకోవాలని ఆయన సూచించారు. ఇప్పటికైనా తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు సిగ్గు తెచ్చుకోవాలని ఆయన అన్నారు. ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీపై బాధ్యత ఉంటుందని, ఆ బాధ్యతను విస్మరించి తెలంగాణ కోసం రాజీనామాలు చేయకుండా కాంగ్రెసు శాసనసభ్యులు రాజీనామాలు చేస్తేనే తాము చేస్తామని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు అంటున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications