జగన్‌పై చిరంజీవి విసుర్లు, ముఖ్యమంత్రిపై ప్రశంసలు

ఉత్తరాంధ్ర ప్రజలు తనను విపరీతంగా అభిమానించారని, తన సినిమాలు ఎక్కువగా ఉత్తరాంధ్రలో ఆడాయని, అదే విధంగా ప్రజారాజ్యం పార్టీకి 17 శాతం ఓట్లు మాత్రమే రాష్ట్రవ్యాప్తంగా రాగా, ఉత్తరాంధ్రలో 23 శాతం ఓట్లు వచ్చాయని ఆయన చెప్పారు. సినిమా బాక్సాఫీసు వద్ద హిట్ కానప్పుడు ఎలా ఫీలయ్యానో ప్రజారాజ్యం పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకోని స్థితిలో కూడా అలాగే ఫీలయ్యానని ఆయన చెప్పారు. సామాజిక న్యాయం సాధించే శక్తి తన ఒక్కడికి లేదని, అందుకే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేశానని, తద్వారా సామాజిక న్యాయం సాధించగలననే నమ్మకం ఏర్పడిందని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని కాపాడుతానని తాను హామీ ఇచ్చానని, ఆ హామీని నిలబెట్టుకున్నానని ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. కిరణ్ కుమార్ రెడ్డి లక్ష ఉద్యోగాలిస్తానని హామీ ఇచ్చారని, ఆ హామీని నిలబెట్టుకుంటారని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి మాటలు తక్కువ చెప్పి పనులు ఎక్కువ చేస్తారని ఆయన అన్నారు. సినిమాలు హిట్టవుతాయో లేదో అంచనా వేయలేం గానీ చిరంజీవి కాంగ్రెసులో హిట్టవుతారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. వైయస్ జగన్ వ్యవహార శైలిని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా తప్పు పట్టారు.












Click it and Unblock the Notifications