మరోసారి మంత్రి వట్టి వసంతకుమార్ అసంతృప్తి

పింఛన్లనలో అవకతవకలు జరిగాయని, పాత బిల్లులు క్లియర్ కాలేదని ఆయన అన్నారు. వట్టి వసంతకుమార్‌కు సర్గిచెప్పడానికి ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. రచ్చబండలో వచ్చిన దరఖాస్తులకు పరిష్కారాలకు పొంతన లేదని మరో మంత్రి ధర్మాన ప్రసాద రావు అన్నారు. పోలవరం ప్రాజెక్టును తెలంగాణవాదులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని వట్టి వసంతకుమార్ అన్నారు. తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పోలవరం ప్రాజెక్టు విషయంసో కుమ్మక్కయ్యాయని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అందరూ సహకరించాలని ఆయన కోరారు.
విద్యార్థులు ఫీజులు, ట్యూషన్ ఫీజులు, ఫీజు రీయంబర్స్‌మెంట్ కోసం రేపటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చునని మంత్రి పితాని సత్యనారాయణ చెప్పారు. విద్యార్థులే దరఖాస్తు చేసుకోవాలని, విద్యా సంస్థలు దరఖాస్తు చేయకూడదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications