ఇందిర కష్టాల్లో ఉన్నప్పుడు గెలిపించారు: సిఎం కిరణ్

డిసెంబరులోగా లక్షా పదహారు వేల ఉద్యోగాలు కల్పిస్తామని మరోసారి చెప్పారు. మూడున్నరేళ్లలో పదిహేను లక్షల ఉద్యోగాలు ఎక్కడ నుండి తీసుకు వస్తారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని కాని దానిని కాంగ్రెసు ప్రభుత్వం నిలబెట్టుకుంటుందన్నారు. ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇస్తామన్నారు. కాగా అంతకుముందు కొందరు మహిళలు రచ్చబండలో ముఖ్యమంత్రిని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. పోలీసులు వారిని అక్కడ నుంచి పంపించేశారు. కాగా అంతకుముందు ముఖ్యమంత్రి హైదరాబాదులో విద్యా మిషన్ ఆధ్వర్యంలోని మన భవిత కార్యక్రమాన్ని నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా వద్ద ప్రారంభించారు.












Click it and Unblock the Notifications