భయపడి ఆమోదించారు, బాబు వైఖరితోనే వీడా: నాగం

తాను ఏ పార్టీలో చేరేది లేదని తెలంగాణ కోసం పోరాడే శక్తులతో కలిసి ఉద్యమిస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజా ప్రతినిధులకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామాలు చేసి వాటిని ఆమోదింపజేసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎలా తెస్తారో మంత్రులు ప్రజల్లోకి వెళ్లి సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు శాసనసభ్యులు సీమాంధ్ర నేతలకు అమ్ముడు పోయారని ఆరోపించారు. రెండుసార్లు నిజామాబాద్ ప్రజలు తిరస్కరించిన డిఎస్‌కు ఎమ్మెల్సీగా కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. ఉద్యమానికి కొత్త స్వరూపం తేవడానికి తెలంగాణవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తానన్నారు.












Click it and Unblock the Notifications