వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో నలుగురు ఎమ్మెల్యేల రాజీనామాల ఆమోదం

By Pratap
|
Google Oneindia TeluguNews

Nadendla Manohar
హైదరాబాద్: మరో నలుగురు శాసనససభ్యుల రాజీనామాలను శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సోమవారం సాయంత్రం ఆమోదించారు. తమ పార్టీలకు రాజీనామాలు చేసి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరిన నలుగురు శాసనసభ్యుల రాజీనామాలను ఆయన ఆమోదించారు. గంపా గోవర్ధన్ (కామారెడ్డి), జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్), రాజయ్య (స్టేషన్ ఘనపూర్), జోగు రామన్న (ఆదిలాబాద్) రాజీనామాలను ఆయన ఆమోదించారు. వీరిలో గంపా గోవర్ధన్, జోగు రామన్న తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెరాసలో చేరగా, రాజయ్య, జూపల్లి కృష్ణారావు కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి తెరాసలో చేరారు. స్వతంత్ర శాసనసభ్యుడు కావడంతో తెరాసలో చేరినా కూడా సోమారపు సత్యనారాయణ రాజీనామాను ఆమోదించలేదని తెలుస్తోంది. ఇంతకు ముందు నాగం జనార్దన్ రెడ్డి (నాగర్‌కర్నూలు), నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి (కొవ్వూరు) రాజీనామాలను ఆయన ఆమోదించారు. వీరిద్దరు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు.

కాగా, మూకుమ్మడిగా రాజీనామాలు చేసిన తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుల రాజీనామాలను, తెరాస శాసనసభ్యుల రాజీనామాలను ఆయన తిరస్కరించారు. మొత్తం 61 మంది రాజీనామాలను ఆయన ఆమోదించలేదు. తెలంగాణ కోసం వీరు రాజీనామాలు చేశారు. భావోద్వేగాలకు గురై రాజీనామాలు చేశారనే ఉద్దేశంతో ఆ రాజీనామాలను ఆయన తిరస్కరించినట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కొండా సురేఖలపై, తెలుగుదేశం పార్టీకి చెందిన బాలనాగిరెడ్డి, ప్రజారాజ్యం పార్టీకి చెందిన శోభా నాగిరెడ్డిలపై అనర్హత పిటిషన్లు పెండింగులో ఉన్నాయి. వాటిపై వాదనలు పూర్తి కాలేదు. వాటిపై స్పీకర్ ఏ విధమైన నిర్ణయమూ తీసుకోలేదు.

మహబూబ్‌నగర్ స్వతంత్ర శాసనసభ్యుడు రాజేశ్వర రెడ్డి హఠాన్మరణం పాలయ్యారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏడు శాసనసభా స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిలో ఒకటి ఆంధ్ర ప్రాంతంలో ఉండగా, ఆరు తెలంగాణ ప్రాంతానికి చెందినవే. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన స్థానాలే మూడున్నాయి. కాగా, స్పీకర్ తమ రాజీనామాలను ఆమోదించకపోవడంపై తెరాస, తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు తప్పు పడుతున్నారు.

English summary
Assembly speaker Nadendla Manohar accepted four more MLAs resignations
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X