నేనూ జైలుకెళ్లాలా?: శంకరరావు సంచలన వ్యాఖ్యలు

తనను అధిష్టానమే బయటకు పంపించాలన్నారు. కేబినెట్ నుండి బయటకు వస్తేనే ప్రజలకు మరింత మేలు చేయగల్గుతామన్నారు. తాను కేబినెట్ సమావేశానికి రావడం లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఎస్సెమ్మెస్ పంపించానన్నారు. మంత్రివర్గంలో ఉండమంటే ఉంటా పొమ్మంటే పోతానని సిఎంను ఉద్దేశించి హెచ్చరించారు. అయినా అవినీతిపరులు ఉన్న కేబినెట్‌కు వెళ్లి నేనూ జైలు పాలు కావాలా అని ప్రశ్నించారు. తన తాపత్రయం అంతా పార్టీ బలోపేతం కోసమే అన్నారు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నా వెనుకడుగు వేయకుండా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానన్నారు.












Click it and Unblock the Notifications