వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శంకరన్న: సిఎంకు, అధిష్టానానికి కొరకరాని కొయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy and Shankar Rao
హైదరాబాద్: రాష్ట్ర జౌళి శాఖ మంత్రి పి. శంకరావు సొంత పార్టీ నాయకులకే కొరకరాని కొయ్యగా మారిపోయారు. ఆయనను మంత్రి వర్గం నుంచి తొలగించలేక, భరించలేక సతమతమైపోతున్నట్లు అర్థమవుతోంది. సహచర మంత్రులపై ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఎప్పటికప్పుడు వ్యాఖ్యలు చేస్తూ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మంత్రివర్గ సమావేశాలకు కూడా ఆయన డుమ్మా కొడుతున్నారు. ఆయన ఆరోపణలకు కొంత మంది మంత్రులు గవర్నర్ నరసింహన్‌ దాకా వెళ్లి వివరణలు ఇచ్చుకోవాల్సి వచ్చింది. మంత్రివర్గ సమావేశానికి వెళ్లి తాను కూడా జైలు పాలు కావాలా అని ఇటీవల ఆయన వేసిన ప్రశ్నలోని ఆంతర్యం గ్రహించి బిత్తరపోతున్నారు. అంటే, ఆయన మంత్రులను అవినీతిపరులుగా కట్టిపడేయడానికి సిద్ధపడినట్లు అర్థమవుతోందని అంటున్నారు. తనను పట్టించుకోకుండా, మంత్రివర్గ సమావేశాలకు హాజరు కాకుండా తనపై వ్యాఖ్యలు చేస్తున్న శంకరరావును భరించడం కష్టంగా భావించి ముఖ్యమంత్రి కాంగ్రెసు అధిష్టానానికి ఫిర్యాదు చేశారని అంటున్నారు.

ముఖ్యమంత్రి తనకు సహకరించకపోయినా తాను మంత్రివర్గంలో కొనసాగుతానని, పార్టీ అధిష్టానం చెప్తే దిగిపోతానని శంకరరావు స్పష్టంగా చెబుతున్నారు. అయితే, శంకరరావును అధిష్టానం పెద్దలు పిలిపించి, కొన్ని సూచనలు చేశారని అంటున్నారు. ఇష్టం వచ్చినట్లు వ్యవహరించినా ఫరవా లేదు గానీ మంత్రులపై ఆరోపణలు మాత్రమే చేయవద్దని సూచించారని అంటున్నారు. దీంతో మంత్రులపై ఆరోపణల పర్వానికి స్వస్థి చెప్పినట్లు చెబుతున్నారు.

కాగా, వైయస్ జగన్ ఆస్తులపై హైకోర్టుకు లేఖ రాసి, సిబిఐ విచారణ దాకా వెళ్లడానికి పనిచేసిన శంకరరావును తొలగిస్తే సంభవించే ప్రమాదాన్ని గ్రహించే అధిష్టానం మెతకవైఖరి అవలంబిస్తోందని అంటున్నారు. తాను అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందుననే సహించలేకపోయారని శంకరరావు ఊరేగే అవకాశం ఉందని, శంకరరావును మంత్రివర్గం నుంచి తొలగించలేకపోతున్నారని చెబుతున్నారు. శంకరరావు తీరుపై మంత్రులు వట్టి వసంతకుమార్, ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. పట్టించుకోకుండా ఉంటే సరిపోతుందని ముఖ్యమంత్రి వారికి సలహా ఇచ్చారని అంటున్నారు. ఏమైనా, శంకరరావు రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు.

English summary
it is said that CM Kirankumar Reddy is not in a position to take action against minister P Shankar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X