యువతి గ్యాంగ్ రేప్: వీడియో లీక్, నిందితుల అరెస్టు

ఆ తర్వాత అత్యాచారం జరిగిన రోజు నిందితుడు బాధితురాలి వద్దకు వెళ్లి తన స్నేహితుడికి వైద్య సహాయం కావాలని చెప్పాడు. ఆమెను వెంట బెట్టుకొని వచ్చి తన ఇద్దరు స్నేహితులు ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి తీసుకు వెళ్లాడు. ఆ తర్వాత వారు ఆమెపై అత్యాచారానికి పాల్పడి దానిని వీడియోలో బంధించారు.
తన వీడియోను నిందితులు ఎక్కడ బయటపెడతారో అన్న భయంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దానిని అలుసుగా తీసుకున్న నిందితులు వీడియోను లీక్ చేస్తామని బెదిరించి ఆమె నుండి నుండి నెలకు ఐదువేల రూపాయలు తీసుకున్నారు. ఆ తర్వాత రూ.50 వేలు అడగడం మొదలు పెట్టారు. అంత డబ్బు తాను ఇవ్వలేనని చెప్పడంతో వీడియోను లీక్ చేశారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications