హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గవర్నర్‌ను కలిసే యోచనలో జగన్ వర్గం ఎమ్మెల్యేలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులు ఈ నెల 26వ తేదిన గవర్నర్ నరసింహన్‌ను కలిసే యోచనలో ఉన్నట్లుగా సమాచారం. తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాసం ఓటింగ్ సమయంలో వారు పార్టీ విప్ బేఖాతరు చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన విషయం తెలిసిందే. విప్ దాఖలు చేసిన వారికి స్పీకర్ ఇటీవలె నోటీసులు జారీ చేశారు.

ఈ నేపథ్యంలో వారు ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో వారు స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కూడా కలవాలని నిర్ణయించుకున్నారు. తమకు వచ్చిన నోటీసులపై మూకుమ్మడి వివరణ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. తమను అనర్హులుగా ప్రకటించాలని వారు స్పీకర్‌కు మరోసారి విజ్ఞప్తి చేయనున్నారు.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy camp MLAs may meet governor Narasimhan on 26th of this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X