దాడి చేస్తే ఊరుకోం?: బాబుకు కోదండరామ్ హెచ్చరిక

తెలంగాణవాదులకు నోటీసులు ఇస్తూ, అక్రమ అరెస్టు చేస్తూ పోలీసులు వేధిస్తున్నారన్నారు. జెఏసి నేతలను ముందస్తుగా అరెస్టు చేసి ఆ తర్వాత అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. సమైక్యవాదంతో చంద్రబాబు తెలంగాణపై దాడి చేస్తే ఊరుకునేది లేదన్నారు. తెలంగాణవాదులపై టిడిపి దాడి చేస్తుందన్నారు. పోలీసులు తెలంగాణలో వివక్ష చూపించడం సరికాదన్నారు. ప్రతి ఒక్కరికీ భావ ప్రకటన ఉంటుందని కానీ అక్కడి ప్రజల ఆకాంక్షను నేతలు గుర్తెరగాలన్నారు. టిడిపి నేతలు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలను పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు.












Click it and Unblock the Notifications