సిబిఐ ఎదుట విజయసాయి, కోనేరు పిటిషన్ వాయిదా

కాగా కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో నాలుగవ నిందితురాలైన ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మికి రాష్ట్ర హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఆమె బెయిల్‌ను రద్దు చేస్తూ హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 6వ తేదీలోగా సిబిఐ కోర్టు ముందు లొంగిపోవాలని హైకోర్టు ఆమెను ఆదేశించింది. డిసెంబర్ 2వ తేదీన ఆమెకు సిబిఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సిబిఐ కోర్టు మంజూరు చేస్తూ జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ సిబిఐ హైకోర్టుకు వెళ్లింది. దీనిపై వాదోపవాదాలు ముగిసిన తర్వాత హైకోర్టు సోమవారం తన నిర్ణయాన్ని వెలువరించింది.












Click it and Unblock the Notifications