పురుషుడిని నిర్బంధించిన మహిళ, కేసు నమోదు

Anantapur District
అనంతపురం: ఓ మహిళ ఓ పురుషుడిని గదిలో బంధించింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా కదిరిలో జరిగింది. నాగేశ్వరి అనే మహిళ సూర్యనారాయణ అనే వ్యక్తిని నిర్బంధించింది. ఇరుగుపొరుగువారి సహాయంతో అతను బయటపడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను గదిలో బంధించి నాగేశ్వరి అనే మహిళ లక్ష రూపాయలు డిమాండ్ చేసిందని కడప జిల్లా సింహాద్రిపురానికి చెందిన సూర్యనారాయణ అనే వ్యక్తి ఆరోపించాడు. ఈ మేరకు పోలీసులకు అతను ఫిర్యాదు చేశాడు.

సింహాద్రిపురానికే చెందిన నాగేశ్వరి కొద్ది రోజుల క్రితం కదిరి వచ్చింది. సూర్యనారాయణతో ఆమెకు వైవాహికేతర సంబంధం ఉందని, దానివల్లనే ఆమె సూర్యనారాయణను బంధించిందని అంటున్నారు. అయితే, తనకు సూర్యనారాయణతో ఏ విధమైన సంబంధం లేదని, తనను లైంగికంగా వేధించినందుకే అతన్ని బంధించానని నాగేశ్వరి అంటోంది. గదిలో బందీ అయిన సూర్యనారాయణ చిత్తు కాగితాలపై తనను విడిపించండి అంటూ రాసిన కాగితాలను బయటకు విసిరేస్తూ వచ్చాడు. అవి తమ కంటబడడంతో ఇరుగుపొరుగు వారు జోక్యం చేసుకుని అతన్ని విడిపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+