చంద్రబాబు రావొద్దు: టవరెక్కిన విద్యార్థి, పోరు ఉద్రిక్తత

హన్మకొండ ఆర్ట్స్ కళాశాల వద్ద ఓ విద్యార్థి టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. చంద్రబాబు తన పర్యటనను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించిన తర్వతే తెలంగాణకు రావాలన్నారు. నలుగురు విద్యార్థులు పెట్రోల్ పోసుకోగా లెక్చరర్లు అడ్డుకున్నారు. కాగా అరెస్టులను ఆపాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ చైర్మన్ గద్దర్ సూచించారు. అరెస్టులపై హెచ్చార్సీలో ఫిర్యాదు చేస్తామని వరంగల్ జిల్లా అధ్యక్షుడు పెద్ది సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. కాగా ఈ నెల ఆరవ తేదిన వరంగల్ జిల్లాలో బాబు పర్యటన ఉన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications