ఉత్సాహంగా ఉంటే లేటెందుకు?: బాలయ్యకు కాంగ్రెస్

ఉప ఎన్నికల్లో పోటీ చేసి బాలయ్య తన జనాకర్షణ నిరూపించుకోవాలని శాసనమండలి సభ్యుడు రంగారెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీని బాబు బతికించలేరని అర్థమైపోయిందని అందుకే బాలయ్య ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారని విమర్శించారు. మహానేత ఎన్టీఆర్‌నే ఓడించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెసు పార్టీకి బాలయ్య ఏమాత్రం పోటీ కాదన్నారు. కాగా కృష్ణా జిల్లా పర్యటనలో బాలకృష్ణ తాను త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని, 2014 ఎన్నికల్లో పోటీ చేస్తానని, అప్పుడు టిడిపియే అధికారంలోకి వస్తుందని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications