బాలయ్య అంటున్న ఫ్యాన్స్, బాబే అంటున్న టిడిపి

అయితే ఈ విషయంపై టిడిపి క్యాడర్ కినుక వహిస్తున్నట్లుగా కనిపిస్తోంది. బాలయ్య రాజకీయ ఆరంగేట్రానికి ముందే అభిమానులు ఆయనను సిఎంగా ఊహించుకోవడం చూస్తుంటే ఆయన పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చాక టిడిపికి తలనొప్పులు తప్పవని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. బాలయ్య పర్యటన సందర్భంగా టిడిపి కార్యకర్తలు మాట్లాడుతూ.. బాలయ్య రాజకీయాల్లోకి రావడం తమకు ఉత్సాహంగా ఉందని, టిడిపికి ప్లస్ అవుతుందని అంటూ చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికే ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారని చెబుతున్నారు. బాలయ్య సిఎం అవుతాడని అభిమానులు, బాబును సిఎం చేయడానికి నందమూరి హీరో వస్తున్నాడని పార్టీ క్యాడర్ చెబుతుండటం విశేషం.












Click it and Unblock the Notifications