లగడపాటితో సర్వే చేయించాలి: కిరణ్‌కు శంకరన్న సలహా

అంబేడ్కర్ విగ్రహాల ధ్వంసం దురదృష్టకరమన్నారు. పార్టీకి ఇది ప్రమాదకరమైన సంకేతమన్నారు. వస్త్రాలపై వ్యాట్ వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. తనను మంత్రివర్గం నుండి తొలగించడానికి తాను చేసిన తప్పేమిటని ప్రశ్నించారు. అవినీతిపై పోరాటం చేసినందుకే తనను మంత్రివర్గం నుండి బయటకు గెంటారని, అలా పోరాటం చేయవద్దా అని ప్రశ్నించారు.
ఉత్తర ప్రదేశ్‌లో అవినీతిపరులపై వేటు పడితే, మన రాష్ట్రంలో మాత్రం అవినీతిపై పోరాడిన వారిని సస్పెండ్ చేస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే తీర్పు చెబుతారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఉప ఎన్నికలు ప్రభుత్వానికి రిఫరెండమే అన్నారు. నా వల్ల పార్టీకి నష్టమో లాభమో భవిష్యత్తులో తెలుస్తుందన్నారు. నా వ్యతిరేకులంతా ఏకమై తనకు ఈ పరిస్థితి తీసుకు వచ్చారన్నారు.












Click it and Unblock the Notifications