జగన్ కేసు: విజయ సాయి రెడ్డి తర్వాత సునీల్ రెడ్డే

సునీల్ రెడ్డిని ఇంట్లో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జగన్ భవనాల నిర్మాణ వ్యవహారాలు మాత్రమే కాకుండా జగన్ వ్యక్తిగత విషయాలు కూడా సునీల్ చూస్తుంటాడని సమాచారం. సునీల్ రెడ్డి కడప జిల్లా కాంగ్రెసు శానససభ్యుడు వీరశివా రెడ్డి తమ్ముడి అల్లుడు. జగన్ భార్య భారతికి సమీప బంధువు. సునీల్ రెడ్డి జగన్‌కు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశారు. సోదాల తర్వాత సునీల్ రెడ్డిని సిబిఐ అధికారులు అరెస్టు చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. జగన్ ఆస్తుల కేసులో అనూహ్యంగా సునీల్ రెడ్డి పాత్ర ముందుకు వచ్చింది. సునీల్ రెడ్డి నుంచి సిబిఐ అధికారులు పలు కీలకాంశాలను రాబట్టినట్లు తెలుస్తోంది. సిబిఐ అధికారులు సునీల్‌ను ఎమ్మార్ కేసులోనూ విచారిస్తున్నారు. ఈ కేసులోనూ అరెస్టు చేసే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications