ప్రేమ జంట ఆత్మహత్య, పెద్దలు పెళ్లికి నిరాకరించినందుకే

Kurnool District
కర్నూలు: కర్నూలు జిల్లా రుద్రవరంలో బుధవారం విషాద సంఘటన చోటు చేసుకుంది. ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. పెద్దలు తమ పెళ్లికి అంగీకరించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై వారు ఈ ఘటనకు పాల్పడ్డారు. రుద్రవరం బెస్త కాలనీకి చెందిన శ్రీనివాసులు(19), బ్రహ్మేశ్వరి(16) గత కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి కులాలు వేర్వేరు కావడంతో పెళ్లికి శ్రీనివాసులు తల్లిదండ్రులు అంగీకరించలేదు.

పెళ్లికి అంగీకరించకపోవడంతో మనస్తాపం చెందిన శ్రీనివాసులు పురుగుల మందు తాగాడు. అపస్మారకస్థితిలో ఉన్న శ్రీనివాసులును కుటుంబసభ్యులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను అక్కడ మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న బ్రహ్మేశ్వరి ఇంట్లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే, ప్రేమ జంట ఆత్మహత్యలపై పోలీసులకు ఫిర్యాదు అందలేదని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+