హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మళ్లీ స్వైన్‌ఫ్లూ కలకలం, హైదరాబాద్‌లో ఒకరి మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

United Andhrapradesh
హైదరాబాద్: రాష్ట్రంలో మళ్లీ స్వైన్‌ఫ్లూ కలకలం మొదలైంది. శుక్రవారం ఉదయం స్వైన్‌ఫ్లూ కారణంగా ఓ వ్యక్తి మృతి చెందారు. ఆయన శ్రీకాకుళం జిల్లాకు చెందిన మహంతిగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఆయనకు స్వైన్‌ఫ్లూ సోకడంతో హైదరాబాద్ హాస్పిటల్ తరలించారు. చికిత్స పొందుతూ ఆయన ఉదయం మృతి చెందారు. స్వైన్‌ఫ్లూ పొందుతున్న మరో ఇద్దరు కూడా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ స్వైన్ ఫ్లూ రాష్ట్రంలో ఇప్పుడు లేక పోయినప్పటికీ పక్క రాష్ట్రాల నుండి ఇది వ్యాపిస్తున్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. రెండు నెలల క్రితం ఒడిశా నుండి వచ్చిన ఇద్దరికి స్వైన్ ఫ్లూ ఉందని గుర్తించి వారికి చికిత్స చేయించారని తెలుస్తోంది.

కొద్ది నెలల క్రితం స్వైన్ ఫ్లూ వ్యాధి రాష్ట్రాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. స్వైన్ ఫ్లూ కారణంగా పలు జిల్లాలో కొందరు మృతి చెందారు. కాగా రాష్ట్రంలో మళ్లీ స్వైన్ ఫ్లూ మరణం నమోదు కావడంతో అధికారులు వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశారు. వైద్య అధికారులతో మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి ఈ విషయమై సమావేశం కానున్నారు.

English summary
One dead with swine flu today in Hyderabad. He found as Mahanthi from Srikakulam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X