హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్యే పదవికి జగన్‌ వర్గం పిల్లి సుభాష్ రాజీనామా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pilli Subhash Chandra Bose
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోసు శుక్రవారం తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామాను స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ఇచ్చారు. స్పీకర్‌ను ఆయన ఛాంబర్‌లో కలిసిన పిల్లి రాజీనామాను సమర్పించారు. తన నియోజకవర్గానికి నిధుల కేటాయింపులో ప్రభుత్వం చూపిస్తున్న వివక్షతను నిరసిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఇదే విషయాన్ని స్పీకర్‌తో చెప్పారు. నిధులు కేటాయించక పోవడంతో జిల్లాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారని సమాచారం. తన రాజీనామాపై వివరణ ఇచ్చేందుకు సభలో తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా ఆయన స్పీకర్‌ను కోరారు. అయితే రాజీనామాను వెనక్కి తీసుకోవాల్సిందిగా స్పీకర్ ఆయనకు నచ్చజెప్పినట్లుగా తెలుస్తోంది.

కాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమ నియోజకవర్గాలకు నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ జగన్ వర్గం ఎమ్మెల్యేలు గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా నియోజకవర్గంలో తమ ప్రాధాన్యత తగ్గించేందుకు ఇతరులను ఇంచార్జులుగా నియమించడం పట్ల కూడా ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేయడం ఇది రెండోసారి. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పేరును సిబిఐ ఛార్జీషీట్‌లో పేర్కొన్నారంటూ మిగిలిన జగన్ ఎమ్మెల్యేలతో సహా రాజీనామా సమర్పించారు. ఆ తర్వాత అవిశ్వాసం సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినందుకు వారిపై విచారణ కొనసాగుతోంది. ఈ సమయంలో జగన్ వర్గం ఎమ్మెల్యేల్లో ఆయన ఒక్కరే రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. ప్రత్యేకంగా నియోజకవర్గానికి నిధుల కేటాయింపులో వివక్ష చూపిస్తుండటం వల్ల ఇబ్బందులు ఎదుర్కోలేకనే ఆయన రాజీనామా చేశారంటున్నారు.

English summary
Pilli Subash Chandrabose resigned for his mlas post today. He gave his resign letter to speaker Nadendla Manohar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X