శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉద్యోగమా, క్లినికా ఏదో తేల్చుకోండి?: వైద్యులకు కొండ్రు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kondru Murali
శ్రీకాకుళం: ప్రభుత్వం వైద్యులు ప్రైవేటు క్లినిక్‌లు నడపాలనుకుంటే ఉద్యోగాలు వదిలేయాలని మంత్రి కొండ్రు మురళీ మోహన్ ఆదివారం ఆల్టిమేటం జారీ చేశారు. ఆయన ఉదయం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు క్లినిక్‌లు నిర్వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. వైద్యులు మనసు పెట్టి చేయాలనుకుంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేయాలని లేదంటే ఉద్యోగం వదిలేయాలన్నారు. ఉద్యోగం వదిలేసి ప్రైవేట్ క్లినిక్‌లకు వెళ్లవచ్చునని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన బాధితులు పూర్తిస్థాయి ఆరోగ్యంతో బయటకు వెళ్లాలని అన్నారు. అందుకు ప్రభుత్వ వైద్యులు పూర్తి బాధ్యత వహించాలన్నారు. వారం రోజుల్లో 104, 108 వాహనాలు రోడ్డెక్కుతాయని ఆయన చెప్పారు.

104 ఉద్యోగుల సమ్మెను వారం రోజుల్లోగా పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. రోగులకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వం యొక్క లక్ష్యమని ఆయన చెప్పారు. కాగా కొందరు ప్రభుత్వ వైద్యులు డబ్బుల కోసం ప్రైవేట్ క్లినిక్‌లలో పని చేస్తున్నారని, అలా చేయడం వల్ల ప్రభుత్వాసుపత్రుల్లో సరిగా పని చేయడం లేదనే వాదన ఉన్న విషయం తెలిసిందే. కొంతమంది ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ క్లినిక్‌లలో పని చేస్తుండటం వల్ల రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

English summary
Minister Kondru Murali warned government doctors about private clinics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X