హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ సమావేశానికి 13 మంది ఎమ్మెల్యేలు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మంగళవారం నిర్వహించిన సమావేశానికి 13 మంది శాసనసభ్యులు హాజరయ్యారు. శాసనసభలో, శాసనమండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై, ఉప ఎన్నికలపై ఆయన శాసనసభ్యులు, ఎమ్మెల్సీలతో సమావేశం ఏర్పాటు చేశారు. తామంతా కలిసికట్టుగానే ఉన్నమని వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు ప్రకటించారు. శాసనసభలో ప్రతిపక్ష పాత్ర పోషించాలని నిర్ణయించారు. ప్రజా సమస్యలపై గళమెత్తాలని వైయస్ జగన్ తమకు సూచించినట్లు మేకపాటి సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు.

ప్రజాసమస్యలపై ప్రభుత్వం ఒత్తిడి తేవాలని శాసనసభ్యులు నిర్ణయించారు. ఉప ఎన్నికల తర్వాత మరింత మంది శాసనసభ్యులు పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు కొండా సురేఖ, అమరనాథ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర రెడ్డి చెప్పారు. శాసనసభా సమావేశాలకు ఎమ్మెల్యేలంతా హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. శాసనసభలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని శాసనసభ్యులు నిర్ణయించుకున్నారు. వచ్చే నెల 2,3,4 తేదీల్లో జగన్ నెల్లూరు కోవూరు శాసనసభ నియోజకవర్గంలో ప్రచారం సాగించనున్నారు.

కోవూరు నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. తెలుగుదేశం నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోటీకి దిగుతారని అనుకుంటున్నారు. కాంగ్రెసు అభ్యర్థిగా పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పేరు ఖరారైంది. తెలంగాణలో ఎన్నికలు జరిగే ఆరు స్థానాల్లో పార్టీ అభ్యర్థులను దించకూడదని జగన్ నిర్ణయించుకున్నారు. జగన్ వెంట 16 మంది కాంగ్రెసు శాసనసభ్యులు, ప్రజారాజ్యం పార్టీకి చెందిన శోభా నాగిరెడ్డి ఉన్న విషయం తెలిసిందే.

English summary
13 MLAs attended to meeting held by YSR Congress president YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X