హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొవ్వూరుపై వెనక్కి తగ్గిన కెసిఆర్, ఎపిఎస్‌కు మద్దతు

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గం నుండి పోటీపై తెలంగాణ రాష్ట్ర సమితి వెనక్కి తగ్గింది. అక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి పార్టీ తరఫున పోటీ చేస్తున్న పెళ్లకూరు సురేష్ రెడ్డికి మద్దతు తెలపాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి పార్టీ తరఫున ప్రచారం చేయడానికి టిఆర్ఎస్ అధ్యక్షుడు, కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఆ పార్టీ అభ్యర్థి ఆహ్వానించారు. ఇందుకు కెసిఆర్ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో సురేందర్ రెడ్డి తరఫున ప్రచారం చేసేందుకు కెసిఆర్ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా అంతకుముందు కొవ్వూరులో టిఆర్ఎస్ తరఫున అభ్యర్థిని నిలబెడతామని కెసిఆర్ రెండు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే.

తాము ఉప ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గం నుండి కూడా పోటీ చేస్తామని కెసిఆర్ ప్రకటించారు. సోమవారం మాట్లాడుతూ సాయంత్రమో రేపో అభ్యర్థిని ప్రకటిస్తామని, స్థానిక అభ్యర్థినే పెడతామని చెప్పారు. తాను రోడ్డు మార్గంలోనే వెళ్లి తమ పార్టీ అభ్యర్థి నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పారు. అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి పార్టీ అభ్యర్థి సురేందర్ రెడ్డి అభ్యర్థన మేరకు పోటీ నుండి తప్పుకొని ఆయనకు మద్దతిచ్చేందుకు నిర్ణయించుకుంది.

English summary
TRS chief K Chandrasekhar Rao step back on Kovur constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X