అక్కను వేధించి చంపిన ప్రియుడిపై తమ్ముడి ప్రతీకారం

శ్రీలత అనే అమ్మాయిని శ్రీనివాస్ తొమ్మిది నెలల క్రితం ప్రేమ, పెళ్లి పేరుతో వేధించి ఆ తర్వాత హత్య చేశాడు. ఇల్లెందు మున్సిపాలిటీ ఎదుటనే శ్రీలతను శ్రీనివాస్ దారుణంగా గొంతు కోసి చంపాడు. ఆ తర్వాత శ్రీనివాస్ జైలుకు వెళ్లాడు. మూడు నెలల క్రితం బెయిల్ పైన విడదలయి బయటకు వచ్చాడు. అయితే తన అక్క శ్రీలత హత్యను చూసిన సోదరుడు అప్పటి నుండి పగబట్టి శ్రీనివాస్ ను చంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. శ్రీనివాస్ కదలికలు ఎప్పటికప్పుడు గమనించి గురువారం అతనిపై దాడి చేశాడు.












Click it and Unblock the Notifications