నాగబాబు లేదా సురేఖ ఎలా పోటీ చేస్తారు: చిరంజీవి

 Chiranjeevi
హైదరాబాద్: తాను రాజ్యసభకు వెళ్తున్నట్లు తనకు ఏ విధమైన సమాచారం లేదని, అటువంటప్పుడు తిరుపతి శాసనసభ నియోజకవర్గం నుంచి తన సోదరుడు నాగబాబు గానీ తన సతీమణి సురేఖ గానీ ఎలా పోటీ చేస్తారని కాంగ్రెసు శాసనసభ్యుడు చిరంజీవి అన్నారు. తాను రాష్ట్రంలో ఉంటే అద్భుతమని, ఢిల్లీ వెళ్లాల్సిస్తే వస్తే మరీ అద్భుతమని ఆయన అన్నారు. తనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చే విషయంపై పార్టీ అధిష్టానం నుంచి తనకు ఏ విధమైన సమాచారం లేదని ఆయన శుక్రవారం మీడియాతో అన్నారు.

తనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి కేంద్ర మంత్రి పదవి ఇస్తారనే వార్తలపై ఆయన ఆ విధంగా అన్నారు. ముఖ్యమంత్రిని అవుతానని తాను ఏనాడూ చెప్పలేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిని అవుతానని తాను ఏనాడైనా చెప్పానా అని ఆయన అడిగారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు తాను ఉప ఎన్నికల్లో ప్రచారం చేసే విషయం ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. అధిష్టానం ఎక్కడ ప్రచారం చేయాలంటే అక్కడ చేస్తానని ఆయన అన్నారు. ఉప ఎన్నికల ప్రచారం గురించి తనను ఏమీ అడగలేదని ఆయన చెప్పారు.

రాజ్యసభ సీటుపై తనకు క్లారటీ లేదని ఆయన అన్నారు. తిరుపతి శానససభ్యుడిగా ఉండడం తనకు అద్భుతమని, పార్లమెంటుకు వెళ్తే మరీ అద్భుతమని ఆయన అన్నారు. రాజ్యసభకు వెళ్లాలని అధిష్టానం చెప్తే వెళ్తానని, రాష్ట్రంలో ఉండాలంటే ఉంటానని, పార్టీ అధిష్టానం ఆదేశాలను శిరసా వహిస్తానని ఆయన అన్నారు. చిరంజీవికి రాజ్యసభ సీటు ఖాయమని మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. కేంద్రంలో చిరంజీవి మంత్రి అవుతారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+