చిరంజీవి రాజ్యసభకు వెళ్తే తిరుపతిలో నాగబాబు పోటీ?

Chiranjeevi and Nagababu
హైదరాబాద్: తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి రాజ్యసభకు వెళితే ఆ స్థానంలో ఆయన సోదరుడు నాగ బాబు పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజారాజ్యం పార్టీ వర్గాలు నాగ బాబుకే సీటు ఇచ్చే విధంగా అధిష్టానాన్ని అడగాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. రాజ్యసభకు మరికొద్ది రోజులు ఉండగానే చిరంజీవి ఎంపిగా వెళితే ఆయన స్థానంలో ఎవరనే విషయం కాంగ్రెసులో జోరుగా చర్చ సాగుతోందంట. చిరంజీవి స్థానంలో తన తనయుడు పోటీ చేయవచ్చనని మంత్రి గల్లా అరుణ కుమారి సూచించారు. అయితే ఈ ప్రస్తావన వచ్చాక ప్రజారాజ్యం పార్టీ వర్గాలు ఆయన తమ్ముడు నాగబాబు పేరు ప్రతిపాదించారు.

ప్రధానంగా చిరంజీవి సూచించిన వారికే సీటు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో తన తమ్ముడు నాగ బాబు పేరు సూచించవచ్చునని ప్రజారాజ్యం వర్గాలు భావిస్తున్నాయి. తిరుపతి నియోజకవర్గం సమస్యలు పరిష్కరించేందుకు చిరంజీవి భారీగా నిధులు మంజూరు చేశారని, ఆ పనులన్నీ పూర్తి కావాలంటే ఆయన సూచించిన వారికే పార్టీ టిక్కెట్ ఇచ్చేలా అధిష్టానం దృష్టికి తీసుకు వెళతామని వారు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+