హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హాల్ టిక్కెట్ కోసం వెళ్లి ఇంటికి రాని ఇంటర్ విద్యార్థి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: ఓ విద్యార్థి హాల్ టిక్కెట్ కోసమని వెళ్లి ఇంత వరకు ఇంటికి తిరిగి రాలేదు. వనస్థలిపురానికి చెందిన సాయి చరణ్ అనే ఇంటర్ సెకండియర్ విద్యార్థి గురువారం సాయంత్రం తాను హాల్ టిక్కెట్ తెచ్చుకుంటానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. అతను ఆర్కే పురం నారాయణ కళాశాలలో చదువుతున్నాడు. సాయి చరణ్ ఫీజు డ్యూ కట్టాలని చెప్పి తన అమ్మ వద్ద రూ.పదివేలు తీసుకొని సాయంత్రం నాలుగు గంటలకు బయటకు వెళ్లాడు. హాల్ టిక్కెట్ కోసమని వెళ్లిన సాయి రాత్రి ఎనిమిది అయిన ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. కళాశాలకు ఫోన్ చేసి అడిగారు. అయితే సాయి హాల్ టిక్కెట్ కోసం రాలేదని, ఫీజు కూడా కట్టలేదని చెప్పారు. దీంతో మరింత ఆందోళన చెందిన తల్లిదండ్రులు వనస్థలిపురం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే సాయి హాల్ టిక్కెట్ కోసం వెళ్లే ముందు తనకు ఇక్కడ ఉండాలని లేదు అని తల్లితో చెప్పారని సమాచారం.

పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. అయితే అమ్మతో తనకు ఉండటం ఇష్టం లేదని చెప్పడంతో పరీక్షల సరిగా రాయలేనేమోననే భయంతో వెళ్లాడా మరే కారణమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. కావాలనే వెళ్లి ఉంటాడని అనుమానిస్తున్నారు.

English summary
Vanasthalipuram police filed missing case against Sai Charan, who is not returned to home till now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X