సింగారించుకోవడమే తెలుసు: గీతారెడ్డిపై నారాయణ

Narayana
హైదరాబాద్: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ మరోసారి వివాదాస్పద వ్యాఖ్య చేశారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డికి సింగారించుకోవడంపై ఉన్న శ్రద్ధ సమస్యలపై లేదని ఆయన వ్యాఖ్యానించారు. చిన్నతరహా పరిశ్రమలకు విధిస్తున్న విద్యుత్ కోతను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్స్ (ఫ్యాప్సియా) ఆధ్వర్యంలో ఇందిరాపార్కువద్ద చేపట్టిన దీక్షా శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు.

గీతారెడ్డికి సమస్యలపై అవగాహన లేదని నారాయణ విమర్శించారు. సమస్యల పరిష్కారానికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అవసరాల కోసం సాధించుకోలేని గ్యాస్ ప్రైవేట్ సంస్థలకు ఎలా వస్తోందని ఆయన ప్రశ్నించారు. గీతారెడ్డికి పరిశ్రమల పట్ల ఎలాంటి అవగాహన లేదు కాబట్టి సీఎం ఈ సమస్యను తన చేతుల్లోకి తీసుకొని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కరెంటు కోతను ఎత్తేయాలని విజ్ఞప్తి చేస్తూ నారాయణ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డికి ఓ లేఖ రాశారు.పారిశ్రామిక రంగంలో సంక్షోభం ముదురుతున్న నేపథ్యంలో సమస్యలను వెంటనే పరిష్కరించి కార్మికులు, ఉద్యోగులను వీధినపడకుండా చూడాలని ఆయన ఆ లేఖలో సీఎంను కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+