• search
  • Live TV
ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జూనియర్ ఎన్టీఆర్‌కు మథిర కోర్టు సమన్లు జారీ

By Pratap
|

Jr NTR
ఖమ్మం: ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌కు ఖమ్మం జిల్లా మథిర కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 20వ తేదీ లోగా తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. 2009 ఎన్నికల సమయంలో అనుమతి లేకుండా రోడ్ షో నిర్వహించినందుకు కోర్టు ఆ సమన్లు జారీ చేసింది. 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ విజయం కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

రాష్ట్రంలోని ఉత్తరాంధ్రలో ఆయన పెద్ద యెత్తున ప్రచారం నిర్వహించారు. ఉత్తరాంధ్ర నుంచి ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఖమ్మం జిల్లా నుంచి హైదరాబాదుకు తిరిగి వస్తూ జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.

English summary
Khammam district Mathira courtb issued summons to Jr NTR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X