సిబిఐ అతిథి గృహంలోనే గాలి జనార్దన్ రెడ్డి

జైలు సిబిఐ కార్యాలయానికి దాదాపు 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దూరం వల్ల ప్రతి రోజూ గాలి జనార్దన్ రెడ్డిని తీసుకుని వచ్చి విచారించి తిరిగి జైలుకు పంపించడం కష్టంగా ఉంటుందని, భద్రతా సమస్యలు కూడా ఉత్పన్నం కావచ్చునని భావించి ఆయనకు సిబిఐ అతిథి గృహంలోనే బస ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం కూడా సిబిఐ అతిథి గృహంలోని క్యాంటిన్ అల్పాహారమే గాలి జనార్దన్ రెడ్డికి అందించారు. కావాలంటే గాలి జనార్దన్ రెడ్డి తరఫు న్యాయవాదులు కూడా తమ అతిథి గృహంలో ఉండవచ్చునని సిబిఐ అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications