వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సినీ నటి జయప్రద రాంపూర్ రాణి అవుతారా?

ఆజంఖాన్‌కు వ్యతిరేకంగా పోటీ చేసిన జయప్రద విజయం కోసం రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ ప్రచారం కూడా చేశారు. దాంతో ఎన్నికపై మరింత ఆసక్తి పెరిగింది. ఉత్తరప్రదేశ్ శానససభ ఎన్నికల్లో చివరి విడత పోలింగ్ శనివారం జరిగింది. తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం జయప్రద మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తనకు పరిస్థితి అనుకూలంగా ఉందని, తమ లోక్‌మచ్ పార్టీ శాసనసభలోకి అడుగుపెడుతుందని ఆమె అన్నారు.
సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ గూండాలను ప్రోత్సహిస్తున్నారని ఆమె విమర్శించారు. రాంపూర్ శాసనసభ సీటులో తమ పార్టీ గెలుస్తుందని గతంలో రాంపూర్ లోకసభ సీటుకు ప్రాతినిధ్యం వహించిన బిజెపి నాయకుడు ముక్తార్ అబ్బాస్ నక్వీ అంటున్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!