కెసిఆర్‌పై ద్వేషం లేదు, కానీ నాటకాలొద్దు: మోత్కుపల్లి

ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ కు ఓటేస్తే వ్యాపారానికి లైసెన్స్ ఇచ్చినట్లేనన్నారు. తన పాదయాత్రకు, ఉప ఎన్నికలకు సంబంధం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక అమరవీరుల కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పారు. తన పాదయాత్రలో కెసిఆర్ అవినీతి, అక్రమాలను బయట పెడతానని అన్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర సమితి చచ్చిపోయిన పార్టీ అని దానిని ఇంకా చంపాల్సిన పని లేదని మరో నేత రేవంత్ రెడ్డి విమర్శించారు.












Click it and Unblock the Notifications